వాస్తవానికి శృంగార కోరికలు అప్పుడే ఎక్కువట

Research Reveal That Type Of Feelings Will Be More In That Age

10:57 AM ON 26th December, 2016 By Mirchi Vilas

Research Reveal That Type Of Feelings Will Be More In That Age

సాధారణంగా యుక్తవయసులో ఉన్న వారికే శృంగార పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని, వయస్సు పెరిగే కొద్దీ శృంగార కోరికలు తగ్గిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఈ అంశంపై కొందరు మహిళలపై సర్వే చేస్తే, కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఈ విషయమై రెండు విభిన్నమైన సర్వేలు నిర్వహించారు. ఒకటేమో టెక్సాస్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తే, మరొకటేమో ప్రముఖ విటమిన్ కంపెనీలలో ఒకటి అయిన హెల్త్ స్పాన్ అనే కంపెనీ నిర్వహించింది. ఈ రెండు సర్వేలూ వెల్లడించిన విషయాలన్నీ దాదాపు సమానంగానే ఉన్నాయి. సర్వే విషయాలేమిటో చూద్దాం.

యవ్వనంలో కంటే 30 నుంచి 40 ప్రాయంలోనే శృంగార పరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని సగటు మహిళలు భావిస్తున్నారట. ఈ మేరకు సర్వేలు స్పష్టం చేశాయట. హెల్త్ స్పాన్ కంపెనీ ఈవిషయమై నిర్వహించిన పరిశోధనలో దాదాపు 75 శాతం మంది మహిళలు మెనోపాజ్ దశ అనేది వారి రిలేషన్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని తేలింది. నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మెనోపాజ్ కి చేరువలో ఉంటారు. దీనివల్ల వారిలో హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ , ఆత్రుత ఏర్పడతాయి. అందువల్ల వారికి ఆ వయసులో శృంగారంపట్ల కోరికలు కాస్త ఎక్కువగానే కలుగుతాయట.

ఇక టెక్సాస్ యూనివర్సిటీ 827 మంది మెనోపాజ్ కి చేరువైన విదేశీ మహిళలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ శృంగార జీవితం గతంలో కంటే మెనోపాజ్ తర్వాత ఇంకా బాగుందని చెప్పారు. 20/30 ఏళ్ల ప్రాయంలో తాము నెలలో 10 సార్లు పాల్గొనగా, 45 నుంచి 60 ఏళ్ల మధ్యకాలంలో అంతకు రెట్టింపుగా శృంగార జీవితం గడుపుతున్నారట. 34 నుంచి 38 ఏళ్ల వయసులో తాము సెక్స్ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించినట్టు వారు చెప్పారు.

ఇవి కూడా చదవండి: ఇంతకీ అమ్మాయిలకు ఇలాంటి అబ్బాయిలే కావాలట

ఇవి కూడా చదవండి: పులి చర్మంపై గల చారల వెనుక అసలు రహస్యం ఇదే!

English summary

A Research had been revealed that what age women's sexual desire peaks and some shocking results have been came out that woman's sex life really begin at the age of thirty to forty.