ఏప్రిల్ 22న పెళ్లి చేసుకోబోతున్న రేష్మి

Reshmi want to get married in Tirupathi on April 22nd

02:44 PM ON 15th April, 2016 By Mirchi Vilas

Reshmi want to get married in Tirupathi on April 22nd

రేష్మి అనగానే మాములుగా మనకు గుర్తు వచ్చేది జబర్దస్త్ రేష్మినే. అంతగా పాపులర్ అయింది ఆ భామ. కానీ ఇక్కడ చెబుతుంది హీరోయిన్ రేష్మి మీనన్ సంగతి. ఈ నెల సినీ నటి రేష్మి మీనన్ పెళ్లి చేసుకోనుంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న నటుడు బాబీ సింహా, నటి రేష్మి మీనన్‌ పెళ్లికి సిద్ధమవుతున్నారు. తన ప్రియుడు సినీ నటుడు బాబీ సింహా ని ఈ నెల నెల 22వ తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకోనుంది. ఈ మేరకు నటుడు బాబీ సింహా మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహం జరుగనుందని తెలిపారు. అలానే చెన్నైలో లో రిసెప్షన్ ఏర్పాటు చేసారు.

ఏప్రిల్ 24న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్ జరుగబోతోంది. ఈ జంట రిసెప్షన్ కి సినీ ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. కాగా.. ప్రేమికులైన ఈ జంట రేష్మీ మీనన్, బాబీ సింహా ల ఎంగేజ్ మెంట్ గత నవంబర్ లో జరిగింది. బాబీ సింహా తెలుగు, తమిళ్, మళయాళ చిత్రాలలో నటించగా.. రేష్మీ మీనన్ తమిళ్, తెలుగు చిత్రాలలో నటించింది. వీళ్ళిద్దరూ జంటగా "ఉరుమీన్" అనే అనే తమిళ చిత్రంలో నటించి నప్పుడు.. వారి మధ్య ప్రేమ చిగురించింది. బాబీ సింహా జిగర్ తండా లో ప్రదర్శించిన అధ్బుత నటనకు కేంద్ర ప్రభుత్వ అవార్డ్ అందుకొని మంచి పేరు సంపాదించాడు. రేష్మి "హైదరాబాద్ లవ్ స్టోరీ" అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.

English summary

Reshmi want to get married in Tirupathi on April 22nd.