బంగారం ఇంపోర్ట్ కి కళ్ళెం....

Restrictions on gold imports

10:33 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Restrictions on gold imports

బంగారం దిగుమతిని తగ్గించి, కరెంటు ఖాతా లోటును అదుపు చేసేందుకు ప్రవేశ పెట్టిన పథకాలు పెద్దగా ఫలవంతం కాకపోవడంతో బంగారం దిగుమతి విధానంలోనే మార్పులు చేయబోతున్నారా? దేశీయంగా బంగారాన్ని సమీకరించుకునేందుకు, స్థానికంగా కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందా? అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇలా మార్పులు చేయడం వలన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, దిగుమతుల బిల్లు భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. పసిడి నగదీకరణ పథకం కింద గత 6 నెలల్లో కేవలం 2.8 టన్నులు మాత్రమే బ్యాంకులకు చేరగా, పసిడిని బ్యాంకులలో డిపాజిట్‌ చేస్తే వడ్డీ ఆదాయం పొందేందుకు పసిడి నగదీకరణ, మేలిమి బంగారంపై పెట్టుబడి బదులు పసిడి బాండ్‌ పథకాలను ప్రవేశ పెట్టగా, స్పందన అంతగా రాలేదు. అలాగే మేలిమి బంగారం కొనుగోలు చేసే బదులు పసిడి బాండ్ల పై పెట్టుబడి పెడితే, ధర పెరిగిన మేర ప్రతిఫలం పొందే అవకాశాన్నీ ప్రభుత్వం కల్పించినా, దీనికీ ఆదరణ పెద్దగా రాలేదు. దేశీయంగా సమీకరించిన బంగారాన్ని శుద్ధిచేసి, అరటన్ను బంగారంతో గత నవంబరులో 70,000 నాణేలను తయారు చేసినా, అంతటితో ఆ పని ఆగిపోయింది. అందుకే మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి: ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

దేశంలో ప్రజలు, సంస్థలు, దేవాలయాల వద్ద నిరుపయోగంగా 20,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఇంత భారీఎత్తున నిల్వలున్నా, ఏటా దేశంలోకి 900 టన్నుల వరకు పసిడి దిగుమతి అవుతోంది. ఇందులో అధికారికంగా దిగుమతి చేసుకునేది 650-700 టన్నుల వరకు ఉంటే, మరో 200-250 టన్నుల పసిడి అనధికారికంగా, చీకటి మార్గాల్లో (స్మగ్లింగ్‌) వస్తోంది. అధికారిక మార్గాల్లో బ్యాంకులు 400-450 టన్నుల పసిడిని, ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన మరికొన్ని సంస్థలు 200-300 టన్నులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇంత భారీఎత్తున పుత్తడి దిగుమతి కోసం ఏటా విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశం అధికంగా వెచ్చిస్తోంది.

ఇవి కూడా చదవండి: చైతూకి క్లాస్ పీకిన వెంకీ!

బంగారం దిగుమతి విధానంలో సమూల మార్పులను ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తెలిసింది. పుత్తడిని దేశీయ సంస్థల వద్దే సమీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇవ్వనుంది. లండన్‌ బులియన్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ (ఎల్‌బీఎంఏ) ఆమోదించిన పసిడి కడ్డీలను దేశీయ విపణి నుంచే కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని అధికారులు చెబుతున్నారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) ,ఎల్‌బీఎంఏ ద్వారా భారతీయ పసిడి ప్రమాణాలు నెలకొల్పే దిశగా ప్రభుత్వం సాగుతోందని అంటున్నారు. మొత్తానికి పసిడి దిగుమతి పై భారీగానే ఆంక్షలు రానున్నాయి.

ఇవి కూడా చదవండి: పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

English summary

Central Government was thinking to Bring new rules and restrictions on Gold Imports in India.