మంత్రులకూ రిటైర్మెంట్ వయస్సా?

Retirement age for Cabinet Ministers

12:45 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Retirement age for Cabinet Ministers

ఇదేదో బానే వుందే... అమలు సాధ్యమేనా.. అసలు రాజకీయ నేతలకే రిటైర్మెంట్ వయస్సు ఉండాలనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే ముందుగా మంత్రులకు వర్తింప జేస్తే, ఆతర్వాత ఆటోమేటిక్ గా అన్నీ వస్తాయి కదా.. ఇంతకీ విషయం ఏమంటే, ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యస్థీకరించనున్న నేపథ్యంలో బీజేపీలో 75 ఏళ్లపై చర్చ జోరుగా సాగుతోంది. 75 ఏళ్లు పైబడిన కారణంగా మధ్యప్రదేశ్ లో ఇద్దరు మంత్రులకు బీజేపీ ఉద్వాసన చెప్పడంతో... ఆ నిబంధనను కేంద్రంలో కూడా అమలు చేస్తారా అన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ప్రధాని మోడీతో సమావేశమై కేబినెట్ పునర్వ్యస్థీకరణతో పాటు పార్టీలో మార్పులపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పుకుంటున్నారు. 75 ఏళ్ల రూల్ అమలు చేస్తే కేంద్ర మంత్రులు నజ్మా హెప్తుల్లా, కల్ రాజ్ మిశ్రాలపై వేటు పడుతుంది. అయితే వచ్చే ఏడాదిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రముఖ బ్రాహ్మణ నేత మిశ్రాను మంత్రిగా మరికొంతకాలం కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. 75 ఏళ్లపైబడిన కారణంగానే ఎల్ కే అద్వానీ, ఎంఎం జోషీలను మోడీ తన కేబినెట్ లో తీసుకోకుండా వారికి మార్గదర్శక్ మండల్లో చోటు కల్పించారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి కేంద్ర మంత్రులకు రిటైర్మెంట్ అమలు చేస్తే, కొత్త రికార్డ్ అవుతుంది.

English summary

Retirement age for Cabinet Ministers