రేవంతే టార్గెట్ - సెంట్రల్ సెక్యూరిటీ

Revanth Filed a petition in the High Court

12:14 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Revanth Filed a petition in the High Court

అవునా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో విమర్శనాస్త్రాలు సంధించే రేవంత్ రెడ్డికి త్వరలోనే కేంద్రం నుంచి సెక్యూరిటీ రాబోతోందని రేవంత్ కు సన్నిహితంగా ఉండే కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భద్రత పొందుతున్న టీ టీడీపీ ఫైర్ బ్రాండ్ కు కొంతకాలంగా బెదిరింపు ఫోన్ కాల్స్ బాగా ఎక్కువయ్యాయి. దీంతో గతంలోనే తనకు కేంద్రం నుంచి సెక్యూరిటీ కల్పించాలని ఆయన కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు ఉంటే తప్ప తాము ఇలాంటి విషయాల్లో స్పందించలేమని కేంద్ర హోంశాఖ స్పష్టం చేయడంతో,ఇక లాభం లేదని తాజాగా రేవంత్ కోర్టును ఆశ్రయించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందని, కేంద్రం భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోరడం, ఇందుకోసం వారం రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగాయి. రక్షణ కల్పించడానికి ఉన్న అడ్డంకులు తెలపాలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ కు సంబంధించిన కాల్ డేటా ఇచ్చేందుకు కూడా రేవంత్ సిద్ధంగా ఉండటంతో, ఆయన కేంద్రం నుంచి భద్రత పొందడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.మొత్తానికి రేవంత్ ఒక్కడూ టి అర్ ఎస్ సర్కార్ పై అలుపెరుగని పోరాటం సాగిస్తూ , టార్గెట్ అయ్యాడా?

ఇది కూడా చూడండి: 6వేల మంది బట్టలిప్పేసి నిరసన

ఇది కూడా చూడండి: త్రివిక్రమ్ కాపీ కొట్టి తీసిన సినిమాలు ఇవే!

ఇది కూడా చూడండి: ఐపీఎల్ లో మన క్రికెటర్లు ఒక్క రన్ కి ఎంత సంపాదించారో తెలుసా?

English summary

Revanth Filed a petition in the High Court