రేవంత్‌ ధీమా ...

Revanth Reddy On GHMC Elections

06:30 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Revanth Reddy On GHMC Elections

హైదరాబాద్‌ గ్రేటర్ ఎన్నికలకు సమబందించి తెలుగు తమ్ముళ్ళ మాట ఎలావున్నా, ఆరునూరైనా తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని టిడిపి శాసనసభాపక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి యమ ధీమాగా వున్నారు.అందుకే ఓట్లు, సీట్లు, మేయర్‌ పీఠం మనదే అన్న నినాదంతో ముందుకెళ్లాలని టిడిపి కార్యకర్తలకు ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్‌ ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగురవేస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.

ఇక మేయర్‌ ప్రత్యక్ష ఎన్నికపై మంత్రివర్గంలో చర్చించి అందరినీ ఒప్పించాలని తెలంగాణ రేవంత్ అంటున్నారు. తొలగించిన 26 బీసీ కులాలను, 7 లక్షల ఓట్లను ఎప్పుడు జాబితాలో చేరుస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరు ఎప్పుడు పెడతారో చెప్పాలన్నారు. తెదేపా నాయకుల త్యాగఫలితమే ఈనాటి హైదరాబాద్‌ అభివృద్ధి అని కూడా ఆయన గర్జిస్తున్నారు.

English summary

Telangana TDP leader MLA Revanth Reddy Says that TDP will definitely wins in Up-coming GHMC elections