క్వీన్ బాధ్యతలు

Revathi To Remake Queen Movie

12:20 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Revathi To Remake Queen Movie

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘క్వీన్‌’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రీమేక్‌ చేయాలని నిర్మాత త్యాగరాజన్‌ గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా దర్శకత్వ బాధ్యతలు నటి రేవతికి అప్పగించినట్టు వినవస్తోంది. స్క్రిప్టు పనులు పూర్తి చేసిన రేవతి ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషిస్తున్నారట. తెలుగు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయికలుగా చలామణీ అవుతున్న ఒకరని ‘క్వీన్‌’గా చూపించే ప్రయత్నాల్లో నిమగ్నంయ్యారట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తారని అంటున్నారు. అయితే క్వీన్ ఎవరనేది పెద్ద చర్చ జరుగుతోంది.

English summary

Veteran actress Revathi to remake Bollywood Super Hit Film "Queen" movie in Both Telugu And Tamil.Recently Producer Thyaga Rajan buyed the rights of Queen movie.