లోకేష్ కి పదవి కోసం రేవంత్  ఆరాటం

Reventh Reddy Says Make Nara Lokesh a Union Minster

09:56 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Reventh Reddy Says Make Nara Lokesh a Union Minster

ఓటు నోటు కేసు ఎదుర్కొంటున్న తెలంగాణా టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో సైతం టిడిపి దారుణ ఓటమి చవిచూడడంతో ఎర్రబెల్లి దయాకర రావు వంటి నేతలు టిడిపికి జెల్ల కొట్టి టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. మరికొందరు నేతలు కూడా గులాబీ కండువాలు కప్పుకోవాలని ఆరాట పడుతున్నారట. ఇక ఇప్పుడు తెలంగాణాలో టిడిపి బతికి బట్ట కట్టాలంటే, పార్టీ నేతలకు కేంద్రంలో మంత్రి పదవి కానీ , ఇతర పదవులను కానీ కట్టబెట్టాలనే మాట వినిపిస్తోంది. ఈ సందర్భంలోనే రేవంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయాలని టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి అంటున్నారు. అంతటితో వదిలి పెట్టలేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కి విన్నవించారు. గురువారం రాత్రి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... లోకేష్‌కు పార్టీ బాధ్యతలే కాకుండా అధికారిక బాధ్యతలు కూడా ఉంటే బాగుంటుందన్నారు. తద్వారా తెలంగాణలో అధికారులకు ఆదేశాలిచ్చే పరిస్థితి లోకేష్‌కు ఉంటుందన్నారు. రాజకీయాల్లో హోదా కూడా ముఖ్యమేనన్నారు. అలాగే తనకు అనుభవం తక్కువని, తప్పటడుగులు, తోట్రుపాట్లు ఉన్నాయన్నారు. వారంలో రెండు రోజులు చంద్రబాబునాయుడు తెలంగాణకు సమయం కేటాయించాలని ఆయన కోరారు. ఇలా కోరడం రేవంత్ మనసులో మాటేనా , లేక రేవంత్ నోట పలికించారా ! రేవంత్ ఆరాటం తీరుతుందో లేదో మరి.

English summary

Recently Telangana TDP has coducted a meeting in Hyderabad.In that Telangana TDP leader Revanth Reddy asked Chandrababu Naidu to make His son Nara Lokesh as Minister.He also asked chandrababu naidu to spend two days in Telangana