చిటికెడంత ఖర్చు..కొండంత పబ్లిసిటీ వర్మది

RGV Single X Budget Was Just 30 Thousand

12:10 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

RGV Single X Budget Was Just 30 Thousand

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ అందరికీ తెలిసిందే. అదేంటంటే వర్మ తాను తెరకెక్కించబోయే 'వంగవీటి' చిత్రం తరువాత తెలుగులో ఇంక సినిమాలు తియ్యనని చెప్పేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే వర్మ 'ఆర్‌జీవి టాకీస్‌' అనే బ్యానర్‌ ని స్థాపించి అందులో షార్ట్‌ ఫిలింస్‌ని తెరకెక్కించి విడుదల చేస్తానని చెప్పాడు. అన్నట్టుగానే తన మొదటి చిత్రం 'సింగిల్‌ ఎక్స్‌' అనే టైటిల్‌ తో తెరకెక్కించాడు. దానికి సంబందించి పోస్టర్స్‌ ని కూడా విడుదల చేశాడు. ఇప్పటి వరకు నాలుగు పోస్టర్లని విడుదల చేస్తే అందులో ప్రతీది అడల్ట్‌ పోస్టర్‌గా ఉంది. ఈ పోస్టర్లు యూత్‌ని బాగా ఎట్రాక్ట్‌ చెయ్యడమే కాకుండా ఎప్పుడెప్పుడు వర్మ ఈ చిత్రాన్ని విడుదల చేశ్తాడని ఎదురు చేసేలా చేశాడు. అయితే ఈ హాట్‌ ఎరోటిక్‌ షార్ట్‌ ఫిలిం కి వర్మ ఖర్చు పెట్టింది. 30 వేలు మాత్రమే నట. కేవలం 30 వేలు మాత్రమే ఖర్చు పెట్టి ఇంత పబ్లిసిటీ సంపాదించాడంటే ఇంక ఈ సినిమా విడుదల చేశాక ఎన్ని లక్షలు రాబడతాడో అని అందరూ ఆలోచిస్తున్నారు.

English summary

Controversial Director Ram Gopal Varma recently started a YouTube channel names RGV Talkies.In that channel he was going to release his Single X movie posters and videos.Recently Ram Gopal Varma has released some adult posters of the movie.A news came to know that this Single Movie Budget was just 30 thousand.This film has created hype in the industry.