వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

RGV Tweet On Radhika Apte Photo On Femina Magzine

09:55 AM ON 7th May, 2016 By Mirchi Vilas

RGV Tweet On Radhika Apte Photo On Femina Magzine

అసలే ఎవరినైనా మాటలతో కుళ్ళబొడుస్తూ ట్వీట్ లమీద ట్వీట్ లు చేసే, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పగ-ప్రతీకారం-కుట్ర-కక్ష..ఇలాంటి రకరకాల కాన్సెప్టులతో బోలెడన్ని సినిమాలు తీసేస్తాడు. సమాజంలో జరిగే ప్రతీ సెన్సేషనల్ ఇన్సిడెంట్..వర్మకు సినిమా స్టోరీ అయిపోతుంది. అలాంటి వర్మ మీద పగ తీర్చుకునే సాహసం ఎవరైనా చేయగలరా? కానీ ఓ హీరోయిన్ వర్మ మీద పగ పట్టిందట పైగా.ఆ విషయాన్ని తనే చెప్పాడు వర్మ. 'హేయ్ రాధికా ఆప్టే.. నువ్విలా పగ తీర్చుకుంటుంటే.. మాలాంటి పేద మగవారు ఏం చేయాలి?'.. ఇదీ వర్మ చేసిన ట్వీట్. దానితోపాటు ఓ పోస్టర్ ని కూడా పోస్ట్ చేశాడు లెండి. ఫెమినా మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్ పై ఉన్న రాధికా ఆప్టే ఫోటో అది. పింక్ కలర్ సూట్ వేసుకుని చిన్న షార్ట్ తో మోకాళ్ల పై కూర్చున్న రాధిక దర్శనమిస్తుంది. ఈ భామకి వేసిన మేకప్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది. చూడగానే అబ్బ ఏముంది అనిపించేలా.. ఆకట్టుకుంటోంది రాధికా ఆప్టే.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్‌ ( వీడియో )

ఇప్పటికే ఓసారి ఇలాంటి అందగత్తెను తన గత 3 జన్మల్లో చూడలేదని పొగిడిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు మాపై పగబట్టేసిందని అంటున్నాడు. ఈ వరుస ట్వీట్ల హంగామా చూస్తుంటే.. రాధికా ఆప్టేకి వర్మ బానే కనెక్ట్ అయినట్లు అనిపిస్తోంది. అందుకే ఇలా వరుసగా రాధికపై ట్వీట్స్ వేస్తున్నాడు. మరి ఇదంతా తన సినిమాలో హీరోయిన్ గా చేయమని చెప్పడానికి గ్రౌండ్ ప్రిపరేషన్ అనే టాక్ వినిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:ఉదయాన్నే ఉప్పునీరు తాగితే ఎంత లాభమో !

English summary

Controversial Director Ram Gopal Varma Tweeted on Heroine Radhika Apte by praising her beauty in indirect manner. He posted that "Hey @radhika_apte What did we poor men do,that you are taking revenge on us like this?" by posting Radhika APte Still on Femina Magazine Cover Page.