డిల్లీ సిఎమ్ఓలో సోదాలు 

Ride on Delhi CMO Office

12:15 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Ride on Delhi CMO Office

డిల్లీ సిఎమ్ కార్యాలయంలో సిబిఐ సోదాలు చేపట్టింది. ఐఎఎస్ రాజేంద్ర కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు తెలియడంతో అతనిపై కేసు నమోదు చేసారు. సిఎమ్ ఓ అనుమతితోనే సోదాలు చేస్తున్నట్లు సిబిఐ పేర్కొంది. అయితే రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని ఈవిధంగా వ్యవహారం సాగిస్తున్నారని , ఇలాంటి సోదాలకు భయపడబోమని డిల్లీ సిఎమ్ కేజ్రీవాల్ ప్రకటించారు.

కేజ్రీవాల్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం దారుణమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. మరోపక్క పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ , బిజెపి యేతర రాష్ట్రాల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఖండించారు.

English summary

CBI rides on delhi CMO Office and delhi cheif minister fires on narendra modi. Central Ministers Venkayya naidu and arun jaitley opposes the words of kejriwal