పోస్టర్‌  ‘రైట్‌ రైట్‌’

Right Right Motion Poster

09:48 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Right Right Motion Poster

సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా, పూజా జవేరి కథానాయిక గా నటిస్తున్న ‘రైట్‌ రైట్‌’ చిత్రం లో ప్రభాకర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను నటుడు సునీల్‌ ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ ‘‘ఎమ్మెస్‌ రాజుగారు చాలామందిని సూపర్‌ స్టార్స్‌గా చేశారు. సుమంత్‌ అలా ఎదగాలి ’’అని అన్నాడు. సుమంత్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘‘సునీల్‌ భయ్యా అంటే నాకు అభిమానం. సెట్లో ఆయన పడే కష్టం చూసి చాలా నేర్చుకొన్నా. ఓ బస్సు ప్రయాణం చుట్టూ నడిచే కథ ఇది. ప్రభాకర్‌ నటన ఆకట్టుకుంటుంది' అని పేర్కొన్నాడు. ఏప్రిల్‌లో పాటల్ని, మేలో ఈ చిత్రాన్నీ విడుదల చేయబోయే ఈ చిత్రానికి సంగీతం: జె.బి అందించాడు.

English summary

Director M.S.Raju's son Young Hero Sumanth Ashwin upcoming film Right Right movie motion poster was released by Hero Sunil in Hyderabad on Sunday.Sunil says that Sumanth have great future.Bahubali Fame "Kalakeya" Prabhakar Played lead role in this movie