రింగింగ్‌ బెల్స్‌ స్మార్ట్‌ఫోన్‌  రూ.500 లోపేనట

Ring Bells Smartphone For Just Rs 500

10:54 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Ring Bells Smartphone For Just Rs 500

మొబైల్ ఫోన్లు రాకతోనే ఓ విప్లవం వచ్చింది. ఫలితంగా ప్రతి చేతిలో మొబైల్ దర్శన మిస్తోంది. రకరకాల మొబైల్స్ , స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో విడుదలైపోతున్నాయి. ఇక భారత దేశంలో అతి చౌకైన స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. దీన్ని దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ రింగింగ్‌ బెల్స్‌ రేపు విడుదల చేయబోతోంది. ‘ఫ్రీడమ్‌ 251’ స్మార్ట్‌ఫోన్‌ను రూ.500 కంటే తక్కువ ధరకే అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ విడుదల చేయనున్నారు. తయారీ, ఉత్పత్తులు, ధరలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇటీవలే రూ.2,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో రెండు ఫీచర్‌ మొబైళ్లను సైతం రింగింగ్‌ బెల్స్‌ విడుదల చేసింది.

English summary

Indian smartphone maker Ring Bells to launch a cheapest smartphone named "Freedom 251"for just Rupees 500 only.This would be the cheapest smartphone in India.This smartphone was going to be launched by Defence Minister of India Manohar Parrikar.