బ్లాకైన రింగో యాప్‌

Ringo App Blocked

05:39 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Ringo App Blocked

సరిగ్గా వారం రోజుల క్రితం నిమషానికి కేవలం 19 పైసలకే దేశమంతా మాట్లాడుకోండి అంటూ ఊదరగోట్టిన రింగో మొబైల్‌యాప్‌ బ్లాక్‌ అయ్యింది.

అతి తక్కువ ధరకే లోకల్‌, ఎస్టీడి, ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను అందిస్తున్న నేపధ్యంలో ఇండియాలోని టెలికాం ఆపరేటర్లు అందరూ కలసి ముకుమ్మడి గా రింగో యాప్ ను బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ రింగో యాప్‌ను టెలికాం ఆపరేటర్లు బ్లాక్‌ చేసిన నేపధ్యంలో రింగో యాప్‌ యజమాన్యం స్పందిస్తూ తమ యాప్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని, అన్ని అనుమతులు, పర్మిషన్లు వచ్చిన తరువాత నే తాము ఆ యాప్‌ను విడుదల చేసామని రింగో యాప్‌ వారు తెలిపారు. త్వరలోనే ట్రాయ్‌ వారిని సంప్రదించి రింగో సేవలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది.

English summary

Ringo app which allows you to make low cost local and international calls without using the Internet. Now this app has been blocked by telecom operators in india