కాల్‌ రేట్లను తగ్గించే కొత్త "రింగో" యాప్

Ringo Low cost calling App

01:56 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Ringo Low cost calling App

నిమిషానికి కేవలం 19 పైసలుతోనే భారతదేశమంతటా మాట్లాడుకునే సదుపాయాన్ని 'రింగో'యాప్‌ అందిస్తోంది.ఎస్‌,టి,డి,లోకల్‌ అని సంభదం లేకుండా దేశమంతటా 19 పైసలు తోనే మనం మాట్లాడుకోవచ్చు. ప్రముఖ టెలికాం ఆపరేటర్లు నిమిషానికి ఏకంగా నిమిషానికి రూ.1.20 పైసలుగా వసూలు చేస్తున్నారు. పైగా స్పెషల్‌ టాపప్‌ లు వేసుకున్నా 40 పైసలను చార్జ్‌ చేస్తున్నారు. ఈ కొత్త రింగో యాప్‌తో మిగతా ఆపరేటర్లతో పోలిస్తే అతి తక్కువ ధరతోనే దేశమంతటా కాల్స్‌ చేసుకోవచ్చు.

రింగో యాప్‌ ద్వారా కాల్స్‌ చేసుకోవాలంటే ముందుగా మన స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇస్టాల్‌ చేసుకోవాలి. ఇన్‌స్టాల్‌ చేసిన తరువాత మన ఫోను నంబరు,మనపేరు,మన జి.మెయిల్‌ ఎకౌంట్‌ వంటి సమాచారాన్ని ఇచ్చి యాప్‌లో రిజిష్టర్‌ అవ్వాలి. ఒక్కసారి మన సమాచారం ఇవ్వగానే మన ఫోన్‌కు ఒక వెరిఫికేషన్‌ మెసేజ్‌ వస్తుంది. మెసేజ్‌లో ఉన్న కోడ్‌ ఎంటర్‌ చేయగానే మనం ఇంక కాల్స్‌ చేసుకోవడానికి సిద్దం అయినట్టే.

రింగో యాప్‌ నుండి మనం మాట్లాడాలనుకునే వ్యక్తి కి డయల్‌ చేయగానే రింగోయాప్‌ ఒక కాల్‌ ప్లేస్‌ రిక్వస్ట్‌ను తీసుకుంటుంది. కాల్‌ ప్లేస్‌ రిక్వస్ట్‌కు మాత్రం ఇంటర్పెట్‌ డేటా అవసరం ఉంటుంది. ఇలా ఒక్కసారి రిక్వెస్ట్‌ వెళ్ళగానే రింగో నుండి మనకు ఒక కాల్‌ వస్తుంది ఆకాల్‌ను లిఫ్ట్‌ చెయ్యగానే మనం కాల్‌ చేయాలనుకున్న వారికి కనెక్ట అవుతుంది. దీనికి మాత్రం ఇంటర్నెట్‌ అవసరం లేదు.

రింగో లో నుండి లోకల్‌ లేదా ఎస్‌.టి.డి. కాల్స్ కు 19 పైసలు , అంతేకాక యఎస్‌ఎ కు నిమిషానికి 87 పైసలు,బంగ్లాదేశ్‌ కు 2.25 పైసలు,యుఎఈకు 10 రూపాయల తోనే ఐఎస్‌డి కాల్స్‌ కూడా చేసుకునే వీలుంది.

మొదటి సారిగా రింగో యాప్‌ లో రిజిస్టర్‌ అయ్యే వారికి 10 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ను రింగో అందిస్తుంది. మన బంధువులు, స్నేహితులు కు రిఫర్‌ చెయ్యడం ద్వారా మనకి రింగో నుండి ఉచిత టాక్‌టైం లభిస్తుంది. రింగోలో టాక్‌టైమ్‌ అయిపోతే మాత్రం రింగో నుండి క్రెడిట్స్‌ కొనుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి అతి తక్కువ కాల్‌ కాస్ట్‌తో మన సన్నిహితుల తో రింగో ద్వారా మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు.

English summary

Ringo app allows you to make low cost local and international calls without using the Internet (WiFi or 3G). You can call any mobile or landline phone number anywhere in the world. Now talk to your closed ones without worrying about phone bills or internet connectivity