50 కేజీల చాక్లెట్ తో వినాయక విగ్రహం.. మరి నిమజ్జనం ఎక్కడ?

Rintu Rathod made a 50 kilos Chocolate Ganesha idol

04:37 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Rintu Rathod made a 50 kilos Chocolate Ganesha idol

వినాయక చవితి అంటే చాలు విగ్రహాలకు వేసిన రంగులతో, వీటితో ఏర్పడే వ్యర్థాలతో నీటి కాలుష్యం అవుతోందని పర్యావరణ వేత్తలంతా తలలు పట్టుకుంటున్నారు. ఎంతవద్దన్నా వినడం లేదు. పైగా ఇంకా వేలం వెర్రిగా కలర్ వినాయకులను పెంచేస్తున్నారు. పండగ పరమార్థం అర్థం చేసుకోకుండా, వాస్తవానికి భిన్నంగా వెళ్లిపోతున్నారు. అయితే తాను అలాకాదని రింటూ రాథోడ్ గత మూడేళ్ళుగా నిరూపిస్తోంది. మొదట్లో చక్కెర వినాయకుడిని తయారుచేసిన ఈమె, గత సంవత్సరం 35 కిలోల చాక్లెట్ తో మూడడుగుల ఎత్తున్న వినాయకుడిని తయారుచేసింది. దాన్ని ఇంట్లోనే పాలల్లో నిమజ్జనం చేసి ఆ చాక్లెట్ షేక్ ని పేదపిల్లలకి పంచిపెట్టి అందరి ప్రశంసలూ అందుకుంది.

1/4 Pages

ఈసారి మరో అడుగు ముందుకేసి 50 కేజీల చాక్లెట్ తో ఐదడుగుల వినాయక విగ్రహాన్ని తయారుచేసింది. ఈసారి కూడా పాలల్లో షేక్ చేసి పిల్లలకు పంచుతానని అంటోంది. నిమజ్జనం పేరుతో ట్రాఫిక్ జామ్ లకు కారణం కాకూడదంటున్న రింటూ చాక్లెట్ పాలని పిల్లలకు ప్రసాదంగా పంచుతోంది.. గత ఏడాది చాక్లెట్ గణేశుడిని చూసిన ఎంతోమంది తమకూ అలాంటి వినాయకుడిని చేసిపెడతారా అంటూ ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారట. కానీ ఈ పనిని నేను లాభం కోసం చేయడం లేదు. మీకు అంతగా ఆసక్తి ఉంటే చూసి నేర్చుకుని మీ గణేశుడిని మీరే చేసుకోండి అని రింటూ అంటోంది. మరి మనం కూడా అభినందించేద్దామా..

English summary

Rintu Rathod made a 50 kilos Chocolate Ganesha idol