బంగారం మళ్ళీ పెరిగింది

Rise In Gold Price

04:30 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Rise In Gold Price

బంగారం ధర మళ్లీ హెచ్చింది. ఈ మధ్య కాలంలో కొంత మెరుగ్గా కనిపించినా, బుధవారం ఒక్కసారిగా రూ.380 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,130కి చేరింది. శూన్య మాసం మరో పది రోజుల్లో ముగిసి, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానున్న నేపధ్యంలో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. . అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.07 శాతం పెరిగి 1,119.70 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

రూ.35,000 దాటిన వెండి

ఇక వెండి కూడా బంగారం దారిలోనే పయనించి రూ.35,000 మార్కును దాటేసింది. ఒక్కరోజులో ఏకంగా రూ.760 పెరిగిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.35,260కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు పెరగడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

English summary

One of the Valuable metal Gold price was increasing day by day.Today gold price was increased by 380 Rupeeas and now the cost of 10 Grams Gold was Rupees 27,130.As like Gold Silver Rate was also raised by 760 rupees this day, the coast Kilogram of SilveR was 35,000