యూఎస్ లో పెరిగిన భారతీయ విద్యార్థులు

Rise in indian students in USA since july

04:10 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Rise in indian students in USA since july

ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళుతున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య 20శాతం పెరిగింది. 2015, నవంబరు నాటికి 1,81,051 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. 2015, జులైలో విడుదల చేసిన నివేదిక నాటితో పోలిస్తే ఈ సంఖ్య 20.7 శాతం పెరిగింది. ఆగస్టు-సెప్టెంబరులో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడం భారత విద్యార్థుల పెరుగుదలకు ప్రాథమిక కారణంగా భావిస్తున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో ఇప్పటికీ చైనానే అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం చైనా విద్యార్థుల సంఖ్య 3,60,091. సైన్స్‌-సాంకేతిక పరిజ్ఞానం-ఇంజినీరింగ్‌- గణితం విద్యార్థుల్లో 84శాతం మంది కంప్యూటర్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌, అనుబంధ సేవలు, ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారని తాజా నివేదిక విశ్లేషించింది.

English summary

The number of Indian students studying at colleges and universities in the United States of America was increased by 20 per cent since July 2015 . More than 1.8 lakh Indian students currently studying in USA