రేప్‌ కేసులు పెరిగిపోతున్నాయ్‌

Rise In Rape Cases In Mumbai

05:19 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Rise In Rape Cases In Mumbai

పోలీసులు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇటీవల జరిగిన ఒక అధ్యాయనం అందరిని ఆశ్చర్యపరచింది. ఈ అధ్యాయనం ప్రకారం గత ఐదు ఏళ్ళతో పోలిస్తే మహిళల రేప్‌ లకు గురయ్యే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని తెలిపింది. 2010 నుండి ముంబైలో అత్యాచారం మరియు వేధింపుల కేసులలో దాదాపు 400% వృద్ధి కనిపించిందని ఎన్‌జిఒ, ప్రజా ఫౌండేషన్‌ వారు విడుదల చేసిన గణాంకాలలో వెల్లడైంది.

ఈ వృద్ధి రేటును 1980 లలో 60 శాతం ఉండగా గత సంవత్సరానికి 27 శాతం తగ్గిందని చెప్పారు. మరోసారి పోలీసులు మాత్రం తప్పుడు ఆరోపణల కేసులు సంఖ్యలను కూడా ఉదాహరించడం సరికాదన్నారు.

2010-2011 లో ముంబై నగరంలో 165 రేప్‌ కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 643 కు పెరిగిందని తెలిపారు. మరోవైపు 2010- 11 సంవత్సరంలో వేధింపుల కేసులతో పోల్చుకుంటే ఆ సంఖ్య ఈ సంవత్సరం 347 శాతం పెరిగిందని,ఈ సంవత్సరం లైంగికంగా వేధించడం వంటి కేసులు 1,675 గా ఉన్నాయని ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని తెలిపారు.

English summary

The NGO, Praja Foundation released statistics that pointed high rise in rape cases in mumbai.It raised 400%