దానికి వయసుతో పనేంటి?

Rishi Kapoor About Valentines Day

09:46 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Rishi Kapoor About Valentines Day

ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావనే మాట తరచూ వింటూంటాం. కానీ వయస్సుతో కూడా పని లేదని నిరూపిస్తున్నారు ఓ వృద్ధ జంట. అలాగే ప్రేమికుల రోజు సందడంతా యువతదే అనే భావన కూడా సరికాదని, ఈ వృద్ధ జంట గట్టిగా చెబుతోంది. 54 ఏళ్లు కలిసి జీవించిన ఈ జంటను అందరూ చూసితీరాలని, మనందరి జీవితంలోనూ ఆ వయసు వస్తుందని పేర్కొంటూ బాలీవుడ్‌ నటులు రిషికపూర్‌. యూట్యూబ్‌ ఛానల్‌లోని ఓ వీడియో సెర్చ్ చేసి, ట్విట్టర్‌లో షేర్‌ చేసాడు. అంతేకాదు మీకు జీవితకాలపు వాలంటైన్‌ కావాలంటే ఈ వీడియో చూడండి... బంధంలో ఉండాల్సినవేమిటో అర్థం చేసుకోండి... అంటూ రిషి ఓ సందేశం కూడా పెట్టాడు.

కాట్‌ ఇన్‌ యాక్షన్‌ పేరుతో ఉన్న ఈ వీడియోలో వివాహమై, అర్థ శతాబ్దం దాటిన ఓ జంట ఉంది. ఇద్దరూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు పట్టించుకోవడం, పనుల్లో పరస్పరం సాయం చేసుకోవడం, మందులు వేళకు వేసుకునేలా చూడడం, మంచి ఆహారం తీసుకునేలా చూడడం చేస్తుంటారు. ఇందులో కిక్కు ఏమంటే, 'ఒక్కపని కూడా సరిగా చేయనని నా భార్య ఇప్పటికీ అంటుంది' అని నవ్వుతూ ఆ భర్త చెబుతూ వివాహ స్వర్ణోత్సవం పూర్తయినా ..... తమ బంధం దృఢంగానే ఉందన్నది ఆ భర్త వాయిస్. మరి .... నిజంగా వీక్షించాల్సిందే.

English summary