ఆప్కాబ్‌ ఛైర్మన్‌కు తీవ్ర గాయాలు - భార్య, డ్రైవర్‌ మృతి

Road Accident For Apkaab Chairman Pinnamaneni Venkateswara Rao

09:59 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Road Accident For Apkaab Chairman Pinnamaneni Venkateswara Rao

హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద మంగ‌ళ‌వారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆప్కాబ్‌ ఛైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సత్యవాణి, కారు డ్రైవర్‌ దాసు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును శంషాబాద్‌లోని ట్రెజెండ్‌ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. సత్యవాణి, దాసు మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి తరలించారు. ఈ ఘటనతో కృష్ణా జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి:బ్రహ్మోత్సవానికి సెన్సార్ ఒకే

ఇవి కూడా చదవండి:బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దన్నందుకు భర్త వేళ్లను కోసేసింది

ఇవి కూడా చదవండి:'బ్రహ్మోత్సవం' స్పెషల్ షోకి పర్మిషన్

English summary

Apkaab Chairman Pinnamaneni Venkateswara Rao Met an Car Accident when he was travelling from Vijayawada To Hyderabad . In this accident his car driver and his wife were dead and Pinnamaneni Venkeswara Rao was seriously injured.