లారీ - కారు ఢీ : ముగ్గురి మృతి

Road Accident In Mahabubnagar District

10:54 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Road Accident In Mahabubnagar District

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ - కారు ఢీ కొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. వివరాల్లోకి వెళితే, కడప జిల్లా రాయచోటి మండలం చిన్నమన్నెం గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హరికిరణ్‌ అనే వ్యక్తి కారు నడుపుతూ నిద్రమత్తులో రోడ్డుకు అవతలివైపు వెళ్లి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరికిరణ్‌(40) తో పాటూ జ్యోతి(38), ఆమె కుమారుడు సాయికిరణ్‌(4) మృతిచెందారు. హరికిరణ్‌ భార్య స్వప్న స్వల్పగాయాలతో బయటపడింది. జ్యోతి భర్త శ్రీధర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో హైదరాబాద్‌- బెంగళూరు రహదారి పై కొద్దిసేపు ట్రాఫిక్‌ అంతరాయమేర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

In an Road Accident in Muhabubnagar District three people were died and one were severly injured in that accident.Accident was occured by hitting lorry with the car