నదిలో పడ్డ బస్సు - 20 మంది మృతి 

Road Accident In Mexico

02:02 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Road Accident In Mexico

రోడ్డు ప్రమాదాలకు ఏ దేశం కూడా అతీతం కాదు. తాజాగా మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో నిండుగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో 20 మంది మృతిచెందగా, మరో 25 మంది గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి. మెక్సికోలోని వెరాక్రూస్‌ ప్రాంతంలో 45 మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. అయితే అటోయక్‌ నది దగ్గర కొచ్చేసరికి బస్సు అదుపు తప్పింది. బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయింది.

ప్రయాణికులంతా కమరోన్‌, కోర్డోబా ప్రాంతాలను చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారులేనని చెబుతున్నారు. బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే అదుపులో తప్పి లోయలో పడివుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘోర ఘటనపై మెక్సికన్ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియటో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

English summary

A bus fell in a river in mexico. In that accident 20 members were died and 25 members were severely injured in that accident.