అదుపు తప్పిన కారు - ఆరుగురు మృతి 

Road Accident Killed Six People In Kurnool

12:17 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Road Accident Killed Six People In Kurnool

కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి వద్ద సోమవారం వేకువ ఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ నుంచి మక్తల్‌ వస్తున్న ఓ కారు మల్లేపల్లి స్టేజి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మక్తల్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల సమాచారం ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన రూబెన్‌... కేరళ టెక్నో స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన కుటుంబంతో సహా కేరళ వెళ్లి మక్తల్‌కు తిరుగు పయనమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా వెల్దుర్తి మల్లేపల్లి వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో రూబెన్‌ సహా భార్య బిస్మాల్‌, తల్లిదండ్రులు ప్రిషియా, దేవిషియా, ఐదు నెలల కుమారుడు, కారు డ్రైవర్‌ పవన్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary

In a Road Accident in occured in kurnool and in that accident Six People were died and they were taken to Kurnool Government Hospital