పెళ్లి అయిన ఇంట .. పెను విషాదం ..

Road Accident Killed Two People In Andhrapradesh

10:40 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Road Accident Killed Two People In Andhrapradesh

పెళ్ళంటే ఆ ఇంట సందడే సందడి ... అందునా పెళ్లి కూతురు ఇంట్లో మరీ సందడి... అదే రీతిలో ఓ అమ్మాయి పెళ్లి సందర్భంగా బంధు, మిత్రుల రాకపోకలు.. పలకరింపులతో..సంతోషం పరచుకుంది. ఇక మూడు ముళ్లు కూడా పడ్డాయి.. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంటి పెద్దలను బలికోరింది. పచ్చని పందింట్లో విషాదం రాజ్యమేలింది. ఏడుపులు.. ఆర్తనాదాలు..ఆ ఇంట్లో విషాద గీతికై మార్మోగాయి. పెళ్లింట్లో పెను విషాదానికి దారితీసిన ఈ ఘటన శ్రీకాళహస్తి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారి కాపుగున్నేరి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,...

పొట్టి శ్రీరాములు నెల్లూరు పట్టణం, నవాబుపేటలోని బంగ్లాతోట ప్రాంతానికి చెందిన శ్రీరాములు(45), పద్మజ(40) దంపతుల కుమార్తెకు, తిరుపతికి చెందిన అబ్బాయితో గురువారం వేకువజామున తిరుచానూరు సమీపంలో వివాహం జరిగింది. వివాహ తంతు ముగియగానే శ్రీరాములు, ఆయన భార్య పద్మజ, పద్మజ అక్కలైన సంపూర్ణమ్మ(46), అనసూయమ్మ(50) కారులో నెల్లూరుకు బయల్దేరారు. శ్రీరాములు కారు నడుపుతున్నాడు. కాపుగున్నేరి సమీపంలోని తొండమనాడు ఆర్చిని సమీపిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ముందుగా వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో కారు అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొని పంటపొలాల్లో బోల్తాపడింది. ఈ ఘటనలో పద్మజ, సంపూర్ణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, .శ్రీరాములు, అనసూయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి రుయాలో చేర్పించారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రికి తరలించి.. పంచనామా అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సందడి లో చోటుచేసుకున్న ఈ విషాదం అందరినీ కలచివేసింది.

ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

బిగ్ షాట్ వెంట వెళ్తున్న సూపర్ స్టార్ ....

రత్నాచల్ కి టెండర్

ఇండియా అభిమానులకు విరాట్ భలే బుద్ధి చెప్పాడు

English summary

Road Accident Killed two people and two people were injured severely in an road accident which was occurred near KapuGuneri . The died people were belong to Nellore District.