విశాఖ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - 11 మంది మృతి

Road Accident Kills 11 People In Visakha District

11:49 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Road Accident Kills 11 People In Visakha District

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద ఆదివారం జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ-కారు-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం విశాఖ నుంచి తుని వైపు వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతలి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా బైక్‌ను ఈడ్చుకుటూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 9 మంది, ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్దయెత్తున గుమిగూడి సహాయచర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భయానక సంఘటన, రోడ్డుపై ఎక్కడికక్కడ పడివున్న మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. కారు, బైక్‌ లారీ కిందకు పూర్తిగా వెళ్లిపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి.

ఇవి కూడా చదవండి :

కామెంటేటర్ హర్షా బోగ్లేపై వేటు పడింది

కేజ్రీవాల్‌పై బూటు - సిడి విసిరిన యువకుడు

పుట్టింగల్‌దేవి ఆలయంలో అగ్నిప్రమాదం: 106 మంది మృతి

English summary

Road Accident occurred in Nakkapalli Mandalam in Vishaka District . In this Road accident 11 people were died in this incident.This incident was occurred because of Lorry Tyre blasted when lorry was travelling.