కర్ణాటకలో 13మందిని బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident Kills 13 People in Karnataka

04:08 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Road Accident Kills 13 People in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. 13మంది ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చిత్రదుర్గ సమీపంలోని మందనాయకలహళ్లిలో ఓ ట్రక్కు అదుపుతప్పి ఈ 13 మంది ప్రాణాలనూ బలిగొంది. స్టీల్‌రాడ్‌ల లోడుతో వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనంపైకి దూసుకెళ్లడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ట్రక్కు భారీ లోడ్‌తో వెళ్తుండటంతో డ్రైవర్‌ కంట్రోల్‌ చేయలేకపోయాడని పోలీసులు తెలిపారు. స్టీల్‌రాడ్‌ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను క్రేన్‌ సాయంతో వాటిని వెలికితీసారు. మృతులంతా కొడగవల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

English summary

In a road accident in Karnataka 13 people were died including a woman.A heavy loaded lorry hits Tata Ace and killed 13 people at the spot.