దీపావళి స్పెషల్: రోస్టెడ్ క్యాప్సికం సూప్.. ఎలా తాయారు చేయాలో చూడండి..

Roasted capsicum soup for Diwali special

03:42 PM ON 28th October, 2016 By Mirchi Vilas

Roasted capsicum soup for Diwali special

పండగ అంటేనే కొత్తబట్టలు, పిండివంటలు... పాత వంటకాలతో పాటు కొత్త వంటకాలు కూడా ఇళ్లల్లో దర్శనమిస్తుంటాయి. అయితే దీపావళి అనగానే స్వీట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీపావళి విందు భోజనం చేసే ముందు రుచికరమైన అపటైజర్ ఉంటే బాగుంటుంది కదా. సూప్స్ ని మించిన అపటైజర్లు ఏముంటాయి?? దీపావళి రోజున మీరు చెయ్యాల్సిన పనులెన్నో ఉంటాయి. ఆ పనుల్లో పడి మీరు అలసిపోతారు కదా. నీటి శాతం అధికంగా ఉన్న సూప్స్ తీసుకుంటే మీ శరీరానికి నూతనోత్తేజం వస్తుంది. అందుకే రోస్టెడ్ క్యాప్సికం సూప్ తయారీ గురించి తెలుసుకుందాం..

దీనిని ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చని క్యాప్సికంతో చేసుకోవచ్చు. మనం తీసుకున్న క్యాప్సికమ్ని బట్టి ఈ సూప్ యొక్క సువాసన, రుచీ ఆధారపడి ఉంటాయి. ఇక ఈ సూప్ తయారీకి కావాల్సిన పదార్ధాలేమిటో, ఎలా తయారు చెయ్యాలో వివరాల్లోకి వెళదాం... సామాగ్రి సమకూర్చుకోవడానికి-10 నిమిషాల సమయం పడుతుంది. కానీ తయారీకి సమయం 30 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చెప్పే సరుకులు కలిపి చేస్తే 4 గురికి సరిపోతుంది. ఇంకా ఎక్కువమందికి కావాలంటే ఇదే నిష్పత్తిలో కలుపుకోవాలి.

1/10 Pages

కావాల్సిన పదార్ధాలు:

ఎర్రని క్యాప్సికం - 22

ఆయిల్ - ఒక టేబుల్ స్పూన్

టమాటాలు - 4

వెల్లుల్లి - ఒక రెమ్మ

బిర్యానీ ఆకులు - 2

నీళ్ళు - 3 కప్పులు

వెన్న తక్కువ ఉన్న పాలు - అరకప్పు

కార్న్ ఫ్లోర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

పంచదార - చిటికెడు

నల్ల మిరియాలపొడి - గార్నిషింగ్ కోసం తగినంత

English summary

Roasted capsicum soup for Diwali special