జింబాబ్వే ఆకలి కేకలు...

Robert Mugabe declares a state of disaster across Zimbabwe

11:14 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Robert Mugabe declares a state of disaster across Zimbabwe

జింబాబ్వే.. ఆకలి కేకలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తీవ్రమైన కరవుకోరల్లో చిక్కుకుపోవడంతో దేశంలో 26 శాతానికి పైగా ప్రజలు ఆహారం లేక అల్లాడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో పశుసంపద మృత్యువాతపడింది. క్షామాన్ని ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన ఆ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే సర్వం కోల్పోయామని చెపూతూ.. జింబాబ్వేను 'విపత్తు దేశం'గా ప్రకటించేశారు. ప్రాంతీయ కరవుతో బాధపడుతున్న ఆఫ్రికా, జాంబియా, జింబాబ్వే దేశాలను ఎల్‌నినో మరింత దుర్భిక్షంలోకి నెట్టింది. గతంలో ఆఫ్రికా 'అన్నపాత్ర'గా పేరొందిన జింబాబ్వే పొరుగు దేశాల నుంచి అవసరాలకు సరిపడా తిండి గింజలు దిగుమతి చేసుకోవడంలో విఫలమైంది. 60 గ్రామీణ జిల్లాల్లోని 15 లక్షల మంది ప్రజలు ఆహార భద్రత కోల్పోయారని తొలుత సంకేతాలు వెలువడగా మొత్తంమీద 20 లక్షలకు పైగా(26 శాతం) ప్రజలు ఆహార అభద్రతతో ఉన్నారని తేలింది. వర్షాభావంతో పంటలు పండకపోవడం, పశ్చిమ దేశాల ఆంక్షలతో దుర్భిక్షం ఏర్పడిందని అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే అన్నారు. అయితే 2000 సంవత్సరంలో ముగాబే అమలు చేసిన భూసంస్కరణల వల్లే దేశానికి ఎక్కువ నష్టం జరిగిందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

English summary

Zimbabwe's President Robert Mugabe has declared a state of disaster in rural parts of the country hit by a drought with more than a quarter of the population facing food shortages in Zimbabwe.