'రోబో 2.0' పోస్టర్ వచ్చేసింది

Robo 2.0 poster was out now

12:46 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Robo 2.0 poster was out now

తన స్టైల్, నటనతో అశేష అభిమానులను ఉర్రుతలూగిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో రోబో సినిమా అతి పెద్ద హిట్ సినిమాగా రికార్డులు సాధించింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న రోబో 2.0 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న 2.0 ఫస్ట్ లుక్ ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు. అయితే, ఈ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రజనీ ఇప్పటికే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ లో శంకర్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్న ఈ పోస్టర్ పై వేసిన టైటిల్స్ లో హీరో పేరుతో పాటు విలన్ అక్షయ్ కుమార్ పేరు కూడా వేశారు. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

English summary

Robo 2.0 poster was out now