సౌత్‌ అమెరికాలో 'రోబో 2.0' ఘాటింగ్‌

Robo 2.0 shooting in South America

03:36 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Robo 2.0 shooting in South America

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా సినిమా 'రోబో 2.0'. 2010 లో రిలీజ్‌ అయ్యి భారీ విజయం సాధించిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శంకర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. చెన్నై లో మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసిన 'రోబో 2.0' సినిమా యూనిట్‌ ఇప్పుడు బొలీవియా వెళ్ళడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గతంలో వీరు బొలీవియా పక్క దేశమైన పెరూ లో మచు పిచ్చు ప్రదేశానికి కి వెళ్ళారు. ఈ సినిమాని 300 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మొదటిసారి ఈ సినిమాలో విలన్‌ గా కనిపించనున్నాడు. అమీ జాక్సన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నాడు.

English summary

RajniKanth's Robo 2.0 movie shooting is helding at South America. Shankar is directing this movie. Amy Jackson was playing as a heroine. Akshay Kumar is acting in a negative role.