కస్టమర్లకు కంపెనీ ఇచ్చే రోబోలు!

Robos giving company to customers in China

12:33 PM ON 6th June, 2016 By Mirchi Vilas

Robos giving company to customers in China

అవునా అంటే అవుననే అంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యామాని ఎక్కడలేని సౌకర్యాలు వచ్చేస్తున్నాయి. మనుష్యులు చేయాల్సిన పనులు రోబోలు చేసేస్తున్నాయి. కాపురం తప్ప అన్నింటికీ రోబోలను వాడేస్తున్నారు. నిజానికి రోబోల వాడకంలో చైనీయులను మించినోళ్ళు లేరు. ఎందుకంటే, ఉదయాన్నే ఇళ్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి రాత్రి మనుషుల్ని నిద్రపుచ్చే వరకు అన్ని పనులకూ రోబోలను వాడేస్తున్నారు. హోటళ్లలో సర్వర్లుగా కూడా రోబోలనే వినియోగిస్తున్నారు. అయితే.. ఇప్పటి దాకా కేవలం ఫుడ్ డెలివరీ మాత్రమే చేసే రోబోలు వచ్చాయి.

కానీ.. ఇప్పుడు మినిహంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ హోటల్ లో సర్వర్లుగానే కాదు.. ఒంటరిగా వచ్చిన కస్టమర్లకు కంపెనీ ఇస్తూ.. బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. చైనాలోని షాంఘై ప్రావిన్స్ లో ఉన్న ఏ రోబోట్ కెఫెను పూర్తిగా రోబోట్ సర్వీస్ థీమ్తో ప్రారంభించారు. ఇక్కడ అనేక రకాల రోబోలు కస్టమర్లకు సేవలందిస్తాయి. కొన్ని రోబోలు కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకోని ఫుడ్ డెలివరీ చేస్తే.. మరికొన్ని ఒంటరిగా వచ్చే కస్టమర్లకు తోడుగా కూర్చొని కంపెనీ ఇస్తాయి! మరికొన్ని డ్యాన్స్.. తైక్వాండో.. జిమ్నాస్టిక్ విద్యలు ప్రదర్శిస్తాయి.

ఇంకొన్ని ఆటలు ఆడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ అలరిస్తాయి. అంతేకాదు.. రోబోటిక్ సైన్స్లో ఆసక్తి ఉన్నవారికి ప్రాథమిక అంశాలను ఈ రోబోలే బోధిస్తాయి. దీంతో చాలా మంది పిల్లలు.. వారి తల్లిదండ్రులు ఈ హోటల్ కి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. స్థానికులతో పాటు.. పర్యాటకులు సైతం ఈ హోటల్ కి ఆకర్షితులవుతున్నారు. ఇది చూస్తుంటే.. చైనాలో రోబోల వాడకం స్థాయి మాములుగా లేదు. భవిష్యత్తులో రోబోలను ఇంకే రకంగా వాడతారో మరి.

English summary

Robos giving company to customers in China