రోబోనా మజాకా

Robot done first kidney surgery

03:03 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

Robot done first kidney surgery

మానవుడు తలుచుకుంటే ఎంతటి అసాద్యమైన పని అయిన సుసాద్యము చేయగలడు. ఎన్నో అద్బుతాలను సృస్టించాడు. ఎన్నో పరిశోధనలు చేపట్టి ఈ ప్రపంచాన్ని అబివృద్ది చేశాడు. మానవుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదని నిరూపించుకున్నాడు. ఇటీవల మనిషి మాదిరిగా చికిత్స లు చేసే రోబో ని తయారు చేశాడు. అదే కాకుండా జంతువులను కూడా కుత్రిమం గా సృస్టిస్తున్నాడు. పక్షులకి శిక్షణలు ఇచ్చి క్యాన్సర్ కారక కణాలను గుర్తించేలా చేశారు. ఇలా ఎన్నో అద్బుతాలు ఒకటా రెండా.... చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
వివరాల్లో కి వెళితే మానవ అద్బుత సృష్టి అయిన ఒక రోబో చైనా లో కిడ్నీ సర్జరీ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. చుసారా ఎంత అద్బుతమో మనిషి దినదినాభి వృద్ది చెందుతున్నాడు అనడంలో ఇదొక సాక్ష్యం. చైనా లో ఆరు సంవత్సరాల బాబు కి కిడ్నీ సర్జరీ జరిగింది. అది స్వయం గా రోబోట్ చేసింది. ఈ సంఘటన నవంబర్ 16 న చోటుచేసుకుందని శుక్రవారం నాడు తెలియజేశారు. ఆ చిన్న బాలుడి కిడ్నీ ఫెయిల్ అయింది అని, దాని కారణంగా ఆ బాలుడు చాలా బాధని అనుభవించాడని, రోబో సహాయం తో మొదటి సారిగా కిడ్నీ సర్జరీ చేయించినట్లు అక్కడి స్పెషలిస్ట్ లు తెలిపారు.
మొదటి సారిగా జరిగిన కిడ్నీ సర్జరీ విజయవంతం కావడం తో పిల్లాడు చిరునవ్వుతో తిరిగి రావడం చూసి అంతా సంతోషంలో తేలుతున్నారు. ఏది ఏమైనా ఒక రోబో సర్జరీ చేసిందంటే గ్రేట్ కదా...!

English summary

Robot done first kidney surgery. Six years boy suffers due to kidney failure. First time the robot did kidney surgery in china.