రోబో నెయిల్‌ ప్రింటర్‌ వచ్చేసింది

Robot Printer can print whatever you wish on your nails

09:00 AM ON 25th November, 2015 By Mirchi Vilas

Robot Printer can print whatever you wish on your nails

మీ గోళ్ళపై గంటల తరబడి నెయిల్‌ పాలిష్‌ వేసుకునే రోజులు ఇక చెల్లిపోయాయి. ఇక నుండి మీకు నచ్చిన ఒక సింబల్‌నో లేదా మీ ఫేవరేట్‌ స్మైలీలనో మీ గోరుపై ఆకర్షణీయంగా ప్రింట్‌ చేయించుకోవచ్చు. కొత్తగా వచ్చిన రోబో నెయిల్‌ ప్రింటర్‌ ఈ పనిని చాలా ఈజీగా, చక్కగా చేస్తుంది.

మార్కెట్‌లోకి ఇంకా విడుదల కాని ఈ రోబో ప్రింటర్‌ ఇండిగోగో అనే క్రౌండ్‌ ఫండింగ్‌ వెబ్‌సైట్‌లో నిధుల వేటలో ఉంది. రోబో ప్రింటర్‌ను తయారు చేసిన కంపెనీ తాను అనుకున్న నిధులను సాధించగానే ప్రింటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరికి కంపెనీ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందిట.

ఈ రోబోప్రింటర్‌ ద్వారా మీకు నచ్చిన బమ్మలను, గుర్తులను ఒక యాప్‌ద్వారా అప్‌లోడ్‌ చేసి కేవలం 3నిముషాలలోనే ప్రింట్‌ చేసుకోవచ్చు. ఫోన్‌లో లేదా కెమెరాలో తీసుకున్న ఫొటోలను సైతం మీ గోళ్ళపై ప్రింట్‌ చేసుకునే వీలు ఉందట. ఈ యాప్‌లో వేలాది ఆకర్షణీయమైన గుర్తులు, ఫొటోల నుండి మీకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. ఈ రోబో ప్రింటర్‌ ధరను 199డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.


English summary