వృధ్దులకు బాసటగా రోబోక్యాట్

Robotic cats for senior citizens

07:13 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Robotic cats  for senior citizens

బొమ్మల తయారీ హ్యాస్బ్రొ కంపెనీ ఇప్పుడు వినూత్నంగా పిల్లిని పోలిన రోబో క్యాట్లను తయారు చేస్తుంది. ఆ పిల్లులు అచ్చం నిజమైన పిల్లులమనే భావన కలిగిస్తాయని వారు చెప్పుకొచ్చారు. వీటి తయారీ వలన రెండు లాభాలు ఉన్నాయని ఒంటరి తనాన్నిపోగొట్టి ఆనందాన్ని కలిగిస్తాయని అంటున్నారు. ఈ రోబో క్యాట్లను మీ మిత్రులకు, ప్రేమికులకు వయస్సుతో నిమిత్తం లేకుండా 5 నుండి 105 సంవత్సరాల వరకు అందరికీ దీన్ని బహుకరించివచ్చని హ్యాస్బ్రొ తన వెబ్సైట్ లో సందేశం ద్వారా తెలిపారు.

ఈ రోబో క్యాట్లలో సెన్సార్ ని అమర్చడం వలన స్పందనలు తెలుస్తాయి.ఈ పిల్లి నిజమైన పిల్లి మాదిరిగానే అరుస్తుందని, మనం ముట్టుకుంటే దానికి తెలుస్తుందని వారు అంటున్నారు. అలాగే దీనికి ముందుగానే బ్యాటరీ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. దీన్ని అన్ని పిల్లుల మాదిరిగా స్నానం చేయించకూడదు. అలా చేయడం వలన రోబో క్యాట్ పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ రోబో క్యాట్ ని ముఖ్యంగా ఒంటరిగా ఉండే ముసలివారి కోసం, వారి ఒంటరి తనాన్ని దూరం చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

English summary

Robotic cats for senior citizens, toy manufacture Hasbro is marketing a life like robotic cat.