రాక్‌ సింగర్  ప్రిన్స్‌ మరణానికి కారణం ఏమిటి?

Rock Star Prince Passed Away

10:37 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Rock Star Prince Passed Away

అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ రాక్‌ గాయకుడు ప్రిన్స్‌(57) కన్నుమూశారు. ఆయన స్వస్థలం మిన్నెసోటాలో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. సొంత ఎస్టేట్‌లోని లిఫ్ట్‌లో ఆయన మృతదేహం కన్పించింది. మృతికి కారణం తెలియలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు. 1980 దశకంలో ప్రిన్స్‌(పూర్తిపేరు ప్రిన్స్‌ రోగర్స్‌ నెల్సన్‌) తన ఆల్బమ్స్‌తో గ్లోబల్‌ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పర్పుల్‌ రెయిన్‌, 1999 లాంటి ఆయన ఆల్బమ్‌లు 100 మిలియన్లకు పైగా అమ్ముడుపోయాయి. రాక్‌, ఫంక్‌, జాజ్‌ రీతుల్లో ప్రిన్స్‌ తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేశారు. ప్రిన్స్‌ మృతిపట్ల హాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

బాలయ్య సినిమాకి పెద్ద కధే వుంది

ఆ దేశంలో అమ్మాయిలు కన్యలుగా ఉంటే స్కాలర్షిప్ ఇస్తారట

5 సంవత్సరాల పాపకి వివాహం చేసిన కసాయి తల్లిదండ్రులు

English summary

Rock Star Prince passes away at his house in Minnesota in America. At present his age was 57 . He became popular with the Albums like 1999,Purple Rain .