జోకోవిచ్‌కి షాకిచ్చిన ఫెదరర్

Roger Feder gives Shock to Nova Djokoric

04:13 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Roger Feder gives Shock to Nova Djokoric

లండన్‌ : స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కి షాకిచ్చాడు. పరుసర సెట్లలో 7-5, 6-2 తేడాతో ఫెదరర్‌ జొకోవిచ్‌ని చిత్తుగా ఓడించాడు. ఈ అఖండ విజయంతో ఫెదరర్‌ సెమీస్‌లోకి దూసుకుపోయాడు. 45 సంవత్సరాల ఏటీపీ వరల్డ్‌ టూర్‌ చరిత్రలో వరుసగా 15 విజయాలు సాధించి తొలి ప్లేయర్‌గా జొకోవిచ్‌ రికార్డుల్లోకెక్కాడు. అతని రికార్డులను బద్దలు కొడుతూ ఫెదరర్‌ జొకోవిచ్‌ని ఓడించాడు. ఈ విజయోత్సాహంతో ముందుకు వెళ్తానని ఫెదరర్‌ అభిప్రాయపడ్డాడు. అనవసరపు షాట్లు ఆడి ఓటమి పాలయ్యానని జొకోవిచ్‌ తెలిపాడు. ఫెదరర్‌ తరువాత మ్యాచ్‌ జపాన్‌ ప్లేయర్‌ నిషికొరితో బరిలోకి దిగనున్నాడు.

English summary

Roger Feder gives Shock to Nova Djokoric