300 గ్రాండ్ స్లమ్ విజయాల వీరుడు

Roger Federer Creates A New Record

11:09 AM ON 23rd January, 2016 By Mirchi Vilas

Roger Federer Creates A New Record

స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ ల్లో అత్యధిక విజయాల రికార్డును తన పేరిట లిఖించుకున్న ఫెదరర్.. తాజాగా మూడొందల గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ లను గెలిచిన తొలి ఆటగాడిగా హిస్టరి క్రియేట్ చేశాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ లో ఫెదరర్ 6-4, 3-6, 6-1, 6-4 తేడాతో గ్రిగోర్ దిమిత్రోవ్(బల్గేరియా)పై గెలిచి నాల్గో రౌండ్ లోకి ప్రవేశించాడు. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ మ్యాచ్ ల్లో విజేతగా నిలిచిన ఆటగాడిగా ఫెదరర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2012లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ను చివరి సారి గెలిచిన ఫెదరర్.. ఆ తరువాత ఆశించిన స్థాయిలో ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు. అయితే గతేడాది యూఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ లలో ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లిన ఫెదరర్ కు సెర్బియా స్టార్, వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ రూపంలో అడ్డంకి ఎదురైంది. ఈ రెండు ఫైనల్ మ్యాచ్ ల్లో ఫెదరర్ పోరాడినా టైటిల్ ను మాత్రం సాధించలేకపోయాడు. ఓవరాల్ గా 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిచిన ఏకైక ఆటగాడిగా ఫెదరర్ గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా ఓపెన్(2004, 06, 07,10) ను నాలుగు సార్లు సాధించిన ఫెదరర్.. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్(2003,04, 05, 06,07, 09, 12) టైటిల్స్ ను ఏడు సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ ను(2009) ఒకసారి, యూఎస్ ఓపెన్ ను(2004, 05, 06, 07, 08) ఐదు సార్లు గెలిచాడు.

English summary

Tennis Super Star Roger Federer creates a new record that he became the first man to win 300 grand slam wins