ధాయ్‌లో పూరీ 'రోగ్‌' ఘాటింగ్‌..

Rogue movie shooting doing in bangkok

02:43 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Rogue movie shooting doing in bangkok

స్పీడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ వరుస చిత్రాలు డైరెక్ట్‌ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. వరుణ్‌తేజ్‌తో 'లోఫర్‌' అయిపోయాక ఇద్దరు కొత్త హీరోల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఒకటి నిర్మాత సి.ఆర్‌ మనోహర్‌ తనయుడు ఇషాన్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'రోగ్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఇందులో ఇషాన్‌ సరసన నేహాశర్మ సోదరి 'ఐషాశర్మ' కధానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం రోగ్‌ చిత్ర ఘాటింగ్‌ బ్యాంకాక్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. హీరోహీరోయిన్ల పై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఐషాశర్మతో పాటు నీలికళ్ల సుందరి 'యాంజెల క్రిస్కీ' రెండో కధానాయికగా నటిస్తోంది.

యాంజెల క్రిస్కీ ఛార్మి నటించిన జ్యోతిలక్ష్మీ చిత్రంలో ఐటంసాంగ్‌ చేసింది. ఈ చిత్రానికి కూడా పూరీనే దర్శకుడు. ఇప్పుడు యాంజెలాని ఐటం నెంబర్‌ నుండి హీరోయిన్‌గా ప్రమోట్‌ చేశాడు పూరీ. రోగ్‌లో యాంజెలా అందాలే సినిమాకి ప్లస్‌ అవుతాయని టాక్‌. దాయ్‌లో వేసిన సెట్‌లో రోగ్‌ చిత్ర యూనిట్‌ ఇలా ఒక ఫోటోలో చిక్కింది చూడండి.

English summary

Rogue movie shooting doing in bangkok who is acting as a debut hero is Ishaan and debut heroine is Isha sharma.