రోహిత్ శర్మ విల్లా ఖరీదు ఎంతో తెలుసా?

Rohit Sharma villa cost and details

03:14 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Rohit Sharma villa cost and details

టీమిండియా వన్డే క్రికెట్ ఓపెనర్ రోహిత్‌శర్మ టీంలోనే కీలక ఆటగాడు. రోహిత్ శర్మ విజ్రుంభించాడంటే ఇంక ఇండియా టీం భారీ స్కోర్ చేస్తుందనే.. రోహిత్ శర్మ ఇండియా టీంకే కాదు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ కి కూడా కీలక ఆటగాడే.. అంతే కాదు ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ కూడా! అయితే రోహిత్ శర్మ తాజాగా ముంబైలోని ఖాండ్లా ప్రాంతంలో ఖరీదైన ఓ విల్లాను కొన్నాడట. ఈ విల్లా ఖరీదెంతో తెలుసా? అక్షరాలా 5 కోట్ల రూపాయలట. నటుడు సునీల్‌శెట్టి ఖాండ్లాలోని ప్రారంభించిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘డిస్కవరీ’ లో ఉంది ఈ విల్లా. దాదాపు 7,500 చదరపు అడుగుల గల ఈ విల్లాలో స్విమ్మింగ్‌పూల్‌తో పాటు రకరకాల సౌకర్యాలకు లోటులేదు.

ఒక విధంగా చెప్పాలంటే ఈ విల్లా ఇంద్రభవనంలా ఉంటుందట. మొత్తం ఏడు ఎకరాల్లో దాదాపు 21 విల్లాలను నిర్మిస్తున్నాడు. మాములుగా అయితే ఈ విల్లా ఖరీదు 8 కోట్ల రూపాయలట. కాకపోతే రోహిత్‌శర్మ కొన్ని సంప్రదింపుల చేసి 5 కోట్లకే ఈ విల్లాను సొంతం చేసుకున్నాడని సమాచారం.

English summary

Rohit Sharma villa cost and details. Team India cricketer and opener Rohit Sharma bought a new villa in Mumbai. And that's cost is 5 crores.