నవ నిర్మాణ దీక్షలో రోజా ప్రత్యక్షం

Roja Attends TO Nava Nirmana Deeksha In Nagari

11:38 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Roja Attends TO Nava Nirmana Deeksha In Nagari

ఇదేమిటి అనుకుంటున్నారా, నిజం ... హామీలు అమలు చేయని ఎపి సిఎమ్ చంద్రబాబును చెప్పుతో కొట్టండి..లేదా చీపుర్లతో కొట్టండని వైసిపి అధినేత జగన్ విమర్శలు గుప్పిస్తుంటే, మరో పక్క ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఆ పార్టీ ఎంఎల్ఎ రోజా తిరుపతిలోని విజయపురంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ప్రత్యక్షం అయింది. దాంతో అక్కడున్న టీడీపీ నేతలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతలోనే తేరుకున్న నేతలు ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. నవనిర్మాణ దీక్ష వేదిక ఎక్కిన రోజా ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్యక్రమంగా చెబుతున్న నవనిర్మాణదీక్షకు స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని, చివరకు ఇవి చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారిపోయాయని ఆమె ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో జరుగుతోన్న నవ నిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన తనను ఆహ్వానించలేదని, అయినా వచ్చానని చెప్పుకొచ్చారు. ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే హోదాలో వచ్చానని చెబుతూనే నవనిర్మాణ దీక్ష ఉద్దేశాలను పక్కన పెట్టి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గతంలో ఒక్క హైదరాబాద్ పైనే చంద్రబాబు దృష్టి పెట్టారని ఇప్పుడేమో అమరావతి నామస్మరణ చేస్తున్నారని...అధికార వికేంద్రీకరణ జరిగితేనే సాధ్యమని రోజా అన్నారు. గడచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించిందేమీలేదని విమర్శించారు. అప్పట్లో హైదరాబాద్ ను పట్టుకుని మిగతా రాష్ట్రాన్ని వదిలేసినట్లుగా ఇప్పుడు అమరావతిని పట్టుకుని మిగతా రాష్ట్రాన్ని మరిచిపోతున్నారని చురకలు వేశారు.

ఇంతలా విమర్శలు గుప్పించినా, ఓ విపక్ష నేతగా రోజా నవనిర్మాణ దీక్షలో పాల్గొనడంతో టీడీపీ నేతలెవరూ ఆమె విమర్శలను పెద్ద సీరియస్ గా తీసుకోలేదట. తమను తీవ్రంగా విమర్శిస్తున్న వైసీపీ నుంచి రోజా హాజరవడం మంచి పరిణామమే అన్నట్లుగా హుందాగా స్వీకరించారట. మొత్తానికి నవనిర్మాణ దీక్ష పిలుపు వైసీపీ అధినేత జగన్ ను కదిలించలేకపోయినా రోజాను కదిలించడమైనా సంతోషకరమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇది సరే గానీ జగనన్నకు రోజా చెప్పే వచ్చిందో లేదంటే తనకు తానుగా వచ్చిందో అంటూ అక్కడ గుసగుసలు వినిపించాయ్.

ఇవి కూడా చూడండి: బాహుబలిని తలదన్నేలా 250 కోట్లతో మల్టీ స్టారర్

ఇవి కూడా చూడండి: మగోడికి పెద్ద మనిషి ఫంక్షన్.. షాకింగ్ న్యూస్ ..

English summary

Ysrcp Fire Brand Nagari MLA Roja was attended to Nava Nirmana Deeksha which was held in Nagari Constituency. In that she fired on Telugu Desham Party and on Chandra babu Naidu.