లోకేష్ పప్పు సుద్ద అంటూ విరుచుకు పడ్డ రోజా

Roja Criticises Nara Lokesh

09:48 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Roja Criticises Nara Lokesh

అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినా , ఎవరెన్ని చెబుతున్నా వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శల జోరు ఆపడంలేదు. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన ఆమె తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై విరుచుకు పడింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె గురువారం అక్కడ మీడియాతో మాట్లాడుతూ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే సత్తా లేని లోకేష్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనే దురుద్దేశంతోనే ఏపీ సీఎం చంద్రబాబు పలు కుట్రలు చేస్తున్నారని మండిపడింది. అసలు లోకేష్కు ఏం తెలుసని ఆమె ప్రశ్ని స్తూ , నిజానికి ఆయనో పప్పు సుద్ద అని ఆమె ఎద్దేవాచేశారు . దమ్ముంటే అవినీతిపై చర్చకు రావాలని లోకేష్ గతంలో సవాల్‌ చేశారని.. ఇలాగే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా దమ్ముంటే... దమ్ముంటే అంటూ లోకేష్ తొడగొట్టారని.. మరి నేడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిందేనని రోజా చెప్పుకొచ్చారు. దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదన్నారు.

ఇవి కూడా చదవండి: రాజమౌళిని భయపెట్టిన బాలయ్య

ఇక తెలుగుదేశం పార్టీలో సరైన నేతలు లేకనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్టుగా కొంటున్నారని ఆమె ధ్వజమెత్తింది. ఫ్యాను గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని రోజా సవాల్ చేసింది. పనిలో పనిగా చంద్రబాబు అవినీతి గురించి ఆరోపణలు చేస్తూ నిప్పులు చెరిగింది.

ఇవి కూడా చదవండి:మొగుడిని ముక్కలుగా నరికేసి ప్యాకింగ్

ఇవి కూడా చదవండిక్షుద్ర పూజలు చేస్తూ దొరికేసిన హీరోయిన్

English summary

Ysrcp Suspended MLA roja continues her fire brand image in Andhra Pradesh Politics. She fired on Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu's Son Nara Lokesh . She said that Nara Lokesh Cannot with even as MLA bu his father was trying him to make him Chief Minister.