జబర్ధస్త్ లో మానేసిన రోజా ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే షాకౌతారు!

Roja is acting as a host for Rachabanda

10:23 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Roja is acting as a host for Rachabanda

జబర్ధస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో.. జడ్జ్ గా కామెడీ స్కిట్ లో నవ్వుతూ, గిలిగింతలు పెడుతూ, మార్కులేసిన రోజా.. గత కొన్ని ఎపిసోడ్స్ గా ఆ షోలో కనిపించడం లేదు. ఆమె స్థానంలో మంచు లక్ష్మీ తీర్పులు చెప్పేస్తున్నారు. అలా జబర్ధస్త్ కు దూరమైన రోజా తాజాగా.. ఓ కొత్త షోకి కొబ్బరికాయ కొట్టేసింది. జెమినీ టీవీలో స్టార్ట్ కానున్న రచ్చబండ అనే రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. బతుకు జట్కా బండి, ఇది కథ కాదు, జీవితం కొత్తగా అనే కాన్సెప్ట్ తో ఫ్యామిలీ గొడవలను సెటిల్ చేసే షో.. లాంటిదే రచ్చబండ అన్నమాట. ఇప్పటికే జీవిత, జయసుధ, సుమలతలు ఇటువంటి షోలకు హోస్ట్ లుగా వ్యవహరించగా, ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్ లోకి రోజా అడుగు వేస్తోంది.

జబర్దస్త్ షో ద్వారా.. జనాలకు చాలా దగ్గరైన రోజా, ఆ మధ్య మాటీవీలో మోడ్రన్ మహాలక్ష్మీ షోలో కూడా అలరించిన రోజా, ఈ కొత్త ప్రోగ్రామ్ తో ఏమేరకు జనాలను ఆకట్టుకుంటుందో మరి. ఇప్పటికే జబర్ధస్త్ షోకి దూరమైన రోజా.. ఎక్స్ ట్రా జబర్ధస్త్ లో జడ్జ్ గా కంటిన్యూ అవుతుండగా, మరి అక్కడ అలాగే కంటిన్యూ అవుతుందా? లేక దానికి గుడ్ బై చెప్పి.. కొత్తగా జెమినీ టీవీలో రాబోతున్న ఈ రచ్చబండ ప్రోగ్రామ్ కి పర్మినెంట్ గా ఫిక్స్ అయిపోతుందా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలో రానుంది.

English summary

Roja is acting as a host for Rachabanda