జబర్దస్త్ నుంచి రోజా ఔట్! ఆమె స్ధానంలో మరో హీరోయిన్

Roja is quitting from Jabardasth comedy show

04:17 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Roja is quitting from Jabardasth comedy show

ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రచారకర్తగా వ్యవహరించిన అనసూయ, రేష్మి కూడా ఇప్పుడు ఏ స్ధాయిలో వున్నారో అందరికీ తెలిసిందే. ఇందులో నాగ బాబు, రోజా జడ్జీ లు గా వ్యవహరించిన సంగతి కూడా తెలిసిందే. అయితే రోజా ఇప్పుడు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే. అయితే అంత బాధ్యత గల పదవిలో ఉన్నరోజా జబర్దస్త్ ప్రతీ ఎంట్రీ లోనూ తాను డాన్స్ వెయ్యడం పై ప్రత్యర్ధి పార్టీ లు విమర్శించడంతో వైసీపీ పార్టీ నాయకులు కూడా మండి పడుతున్నారు. దీనితో రోజా నే స్వచ్చందంగా జబధస్త్ నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుందట.

అయితే ఇప్పుడు రోజా స్ధానంలో రమ్యకృష్ణ ను కానీ, మీనా ని కాని తీసుకోవాలని కార్యక్రమం నిర్వాహకులు భావిస్తున్నారట. పారితోషకం కూడా ఎక్కువగానే వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

English summary

Roja is quitting from Jabardasth comedy show. Actress and YSRCP party MLA Roja is quitting from Jabardasth comedy show.