ఇంతకీ రోజా సారీ చెప్పినట్టా లేనట్టా

Roja Said Sorry To TDP MLA Anita

10:02 AM ON 7th April, 2016 By Mirchi Vilas

Roja Said Sorry To TDP  MLA Anita

ఇన్నాళ్ళూ కొంత కఠిన వైఖరి ప్రదర్శించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు మెత్తబడినట్లు చెబుతున్నారు . అందుకే టీడీపీ ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పిందట. ఏపీ అసెంబ్లీ కమిటీహాలులో జరిగిన ప్రివిలేజ్ కమిటీ విచారణ సందర్భంగా సారీ చెప్పేసింది. సీనియర్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఈ విచారణ జరిగింది. టీడీపీ నేతలు సభలో తనను టార్గెట్ చేసి మాట్లాడారని చెప్పిన రోజా... తన మాటలకు అనిత బాధపడి ఉంటే క్షమించాలని కోరిందట. వైసీపీ ఎమ్మెల్యే రోజా తనను క్షోభకు గురిచేసేలా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమెపై ఏడాది కాలం పాటు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. వేటు నిర్ణయాన్ని రోజాతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్పుపట్టింది. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు - సుప్రీంకోర్టులో పోరాటం చేసింది. శాసనసభ - న్యాయస్థానాల మధ్య ఉన్న పరిధుల మేరకు రోజా సస్పెన్షన్ విషయంలో ఆదేశాలు ఇవ్వడం సబబు కాదని కోర్టులు తేల్చాయి. ఈ నేపథ్యంలో రోజా క్షమాపణ చెప్పే అవకాశం కల్పించగా...ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై రోజా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పిందట.

ఇవి కూడా చదవండి : పవన్-కాజల్ మధ్య హాట్ లిప్ లాక్(వీడియో)

అయితే ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ ఎంఎల్ఎ అనితను అగౌరవపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అగౌరవం కలిగినట్లు అనిత భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్నారు. అనిత అంటే తనకు గౌరవముందన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని... మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ సభ్యులపై టిడిపి ఎమ్మెల్యేలు అభ్యంతరకరంగా మాట్లాడారని... వారిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిటీని కోరినట్లు ఆమె తెల్పింది.

ఇవి కూడా చదవండి :

శ్రీ దుర్ముఖిలో మీ రాశి ఫలాలు తెలుసుకోండి

శివుని పూజ చేయటానికి కొన్ని నియమాలు

English summary

Actress and Ysrcp MLA Roja was suspended for her misbehaviour from Andhra Pradesh Assembly for One year. Now Roja said sorry to TDP MLA Anita. Roja Said that she did not talk anything bad about Anita and If she thought it was wrong then Roja said she was ready to take back that words.