చినబాబు సిమ్ లేని సెల్ లాంటోడన్న రోజా(వీడియో)

Roja satires on Nara Lokesh

04:48 PM ON 15th October, 2016 By Mirchi Vilas

Roja satires on Nara Lokesh

ఈమధ్య అంతగా వార్తల్లో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా టిడిపి చినబాబు అయిన నారా లోకేష్ పై సెటైర్ల వర్షం కురిపించింది. పబ్లిసిటీ ఎక్కువ ఫెర్ఫార్మెన్స్ తక్కువంటూ కామెంట్ చేశారు. టిడిపి జాతీయ కార్యదర్శి అయి ఉండి మండల కమిటీలు ఎలావేస్తారో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అంతటితో రోజా ఆగలేదు. లోకేష్ తీరు ఎలా ఉందంటే.. మహేష్ బాబు సినిమాలోని డైలాగ్ లా డిక్కీ బలిసిన కోడీ చికెన్ షాపు ముందుకెళ్లి తొడగొట్టిందన్న చందంగా ఉందని రోజా, తీవ్రవిమర్శ లు గుప్పించింది. పెద్ద బాబుకు తోడు చినబాబు బయల్దేరాడు. ఆయన సిమ్ కార్డు లేని సెల్ ఫోన్ లాంటివాడు పబ్లిసిటీ ఎక్కువ. పని తక్కువ.

కనీసం మండల కమిటీ ఎలా నియమిస్తారో కూడా తెలియని లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అట. ఈయన జగన్కు పోటీ అట. లోకేష్ తెలుసుకో.. నిన్ను కన్న చంద్రబాబుతో పాటు మోదీ.. పవన్ కలిసికట్టుగా ఎన్నికలకు వస్తే.. రాయలసీమ గడ్డమీద పుట్టిన దమ్మున్నోడిగా ఒంటరిగా పోటీపడ్డ వ్యక్తి జగన్. నిన్ను చూసి జగన్ భయపడాల్సిన అవసరం లేదు అంటూ రోజా ఓ రేంజ్ లో ఏసుకుంది. ఇక అటు చంద్రబాబుపైనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ, తాను.. వెంకయ్య అమెరికాలో పుట్టుండేవాళ్లమంటూ చంద్రబాబు చేసిన ప్రకటన దారుణమని రోజా వ్యాఖ్యానించారు.

1/6 Pages

వీడియో 1:

English summary

Roja satires on Nara Lokesh