మొత్తానికి ఇన్నాళ్లకు రోజా సారీ చెప్పేసింది

Roja says sorry

04:26 PM ON 2nd September, 2016 By Mirchi Vilas

Roja says sorry

సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసింది. అయితే ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలతో కాదు. గతంలో అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతు క్షమాపణ చెప్పేసింది. ఈ మేరకు ఆమె రాసిన లేఖ గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కార్యాలయానికి చేరిందని అంటున్నారు. అసెంబ్లీలో నిందాపూర్వక వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను శాసనసభ ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తనను ఏడాది సస్పెండ్ చేయడం తగదని రోజా సుప్రీం కోర్టుకు వెళ్లారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి ఆమె అక్కడ సంసిద్ధత వ్యక్తం చేయడంతో, దానిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కూడా సూచించింది.

ఈ నేపథ్యంలో రోజా తన క్షమాపణ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అదే లేఖలో అనితపై వ్యాఖ్యల విషయాన్ని కూడా రోజా ప్రస్తావించారు. ఆ రోజు జరిగిన దానికి కూడా బాధపడుతున్నానని, అనిత మనస్తాపానికి గురై ఉంటే దానికి కూడా క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. కాగా, అనిత ఫిర్యాదుపై శుక్రవారం జరగాల్సిన సభా హక్కుల సంఘం సమావేశం, సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: నాన్నకు ప్రేమతో.. కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్

ఇది కూడా చదవండి: ఎవరూ నమ్మలేని భయంకర విషయాలు

ఇది కూడా చదవండి: దెయ్యాలు నివాసముండే ఫేమస్ సిటీస్ ఇవే!

English summary

Roja says sorry. Actress and MLA of YSRCP party Roja says sorry after the long time.