ఎన్టీఆర్ ని తోక్కేస్తున్నారు... రోజా వివాదాస్పద వ్యాఖ్యలు

Roja Says That Chandrababu Naidu suppressing Jr NTR

11:05 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Roja Says That Chandrababu Naidu suppressing Jr NTR

ఇటు నుంచి కుదరప్పుడు అటునుంచి నరుక్కు రావాలన్న రీతిలో ఇప్పుడు రోజా వ్యవహారం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ అయిన రోజా తాజా గా సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు ఎన్టిఆర్ ని ఎపి సిఎమ్ చంద్రబాబుపై ఉసిగొల్పే ప్రయత్నం స్టార్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కేసు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆమె చంద్రబాబును విమర్శిస్తూ, మరికొందరిని కూడా చంద్రబాబుపై ఉసిగొల్పే ప్రయత్నాలు చేసింది. ఇందులో ముఖ్యంగా హరికృష్ణ కుమారుడు హీరో ఎన్టీఆర్ ని ప్రాస్తావించింది.

ఇవి కూడా చూడండి :  

ఇంతకీ విమానం హైజాక్ చేసింది ప్రియురాలి కోసమా !!

గిన్నీస్ బుక్ లో సుశీల

1/5 Pages

జూనియర్ సినిమాలు అడనివ్వడం లేదు ...

ఎన్టీఆర్ ను ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని.. ఆ కోపంతోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆడనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని రోజా ఫైర్ అయింది.. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని, జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కొడుకు లోకేశ్ ఎదగలేడన్న భయంతో ఎన్టీఆర్ను తొక్కేశారని రోజా ధ్వజమెత్తింది. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ఆమె నిలదీసింది.

English summary

Ysrcp MLA And Actress Roja Says that Andhra Pradesh Chief Minister Nara Chandra babu Naidu was supressing Junior NTR.She says that Chandrababu naidu was not allowing to run Junior NTR movies in theatres.