ఏంట్రా నీ గోల ... చెంప పగులగొడతా అంటున్న రోజా

Roja Slaps Participant At Rachabanda Program

11:09 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Roja Slaps Participant At Rachabanda Program

ఆ మధ్య ఎపి సీఎం చంద్రబాబు మీద ఆరోణలు గుప్పించి ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన రోజా తన నోటిని ఇంకా అదుపులో పెట్టుకున్న దాఖలాలు కన్పించడం లేదు. ఈమె నోటి దురుసుతో రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న విషయం మరిచి పోయినట్టుంది. అందుకే టివి షోల్లో కూడా రెచ్చిపోతోంది. ఒంటి కాలిపై లేస్తూ ఈమె చేసే హంగామా చూసిన ప్రేక్షలు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. జబర్థస్త్ లో కిలకిల నవ్వే ఫేస్ తో ఉంటే రోజా జెమినీ టివిలో రచ్చబండ ప్రోగ్రామ్ లో రుస రుస మంటూ తిట్ల పురాణం అందుకుంటోంది. వాస్తవానికి కూలబోతున్న కాపురాలను చక్కదిద్దే ప్రయత్నం కోసం రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టారు. అయితే సరదాగా సాగే జబర్థస్త్ లో ప్రతి చిన్నజోక్ కు పడిపడీ నవ్వే రోజా, .రచ్చబండలో తన విశ్వరూపం చూపింది. ' ఏంట్రా గోల, చెంప పగులగొడతా' అంటూ ఓ వ్యక్తి పైపైకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కు చెందిన ఓ మహిళ కష్టాలను విన్న రోజా కరిగిపోయారు. ఆమె భర్త ఆమెకు చేసిన అన్యాయాన్ని వింటూ రగిలిపోయారు. పెళ్లి చేసుకొని,ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చి, ఇప్పుడు మరో మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తికి లెఫ్ట్ రైట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా అతడు చెప్పిన సమాధానం కూడా చాలా తప్పుగా ఉంది. ఓ అమ్మాయితో గడిపింది, దానిని వీడియో తీసుకున్నా నని చెప్పడంతో రోజా కోపంతో రగిలిపోయింది. తిన్నగా ఊరుకోకుండా అతనిని కొట్టడానికి పైకి లేచింది.అందరూ రోజా టాకింగ్ పవర్ కు జై అంటుంటే కొందరేమో ..ఈ ప్రోగ్రామ్స్ సంసారాలను నిలబెట్టడానికా? లేక నిట్టనిలువునా కూల్చడానికా? అంటూ కామెంట్స్ వేసేస్తున్నారు. ఈమె నైజం ఈ ప్రోగ్రామ్ ద్వారా బయట పడుతోందని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి రోజా తీరు మారేనా?

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలువదట

ఇది కూడా చూడండి: బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఇప్పటివరకు ఎన్ని నిజమయ్యాయో మీరే చూడండి

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

English summary

Roja Slaps Participant At Rachabanda Program in Gemini Tv.