రోజా ఇష్యూ తోనే  ...

Roja Suspension Issue On A.P. Assembly

01:36 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Roja Suspension Issue On A.P. Assembly

శనివారం అసెంబ్లీ జరిగిన సమయం మొత్తం రోజా చుట్టూనే తిరిగింది. చివరకు ఆ ఇష్యూ తోనే సభ వాయిదా పడింది. ఇక అసెంబ్లీ బయట కూడా ఇదే ఇష్యూ నడుస్తోంది. అసెంబ్లీలో రోజా సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ, స్పీకర్ కి ఆ అధికారం లేదని వాదించిన జగన్ బయట మీడియా దగ్గర అదే మాట్లాడారు ఏ అధికారంతో ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నిస్తూ , దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు.

అయితే మంత్రి యనమల మాత్రం సభ నిర్ణయమే అంతిమ నిర్ణయమని , సస్పెన్షన్ ఎత్తేయాలంటే మళ్ళీ ప్రభుత్వమే సిఫార్సు చేయాలి తప్ప, అది స్పీకర్ పరిధిలో ఉండదని చెబుతున్నారు.

కాగా అసెంబ్లీ లోకి అడుగుపెట్టేందుకు వచ్చిన రోజాను మార్షల్స్ , పోలీసులు అడ్డుకోవడం , వారితో వాగ్వివాదానికి దిగడంతో రోజాను పోలీస్ స్టేషన్ కి తరలించడం , అక్కడ సొమ్మసిల్లి పడిపోవడంతో నిమ్స్ కి తరలించిన సంగతి తెల్సిందే. రోజాకు షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటూ బిపి లెవెల్స్ పడిపోవడంతో నిమ్స్ లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

నిమ్స్ లో చికిత్స పొందుతున్న రోజాను వైసిపి నేత జగన్ పరామర్శించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కి లేదన్నారు. ఎం ఎల్ ఏ ను సస్పెండ్ చేసేసి , ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తామంటే ఎలాగని అయన ప్రశ్నించారు. అవసరమైతే కోర్టుకి వెళతామన్నారు.

ఆమె ఎం ఎల్ ఏ గా ఉంటారని , అయితే అసెంబ్లీకి రాకూడదని మంత్రి యనమల అన్నారు. ఒక సాధారణ పౌరు రాలిగా అధికారులను కలవ వచ్చని ఆయన అంటున్నారు. మరి ఏడాది పాటు సస్పెన్షన్ ఇష్యూ సోమవారం సమావేశంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

English summary

Today Andhra Pradesh Assembly Has Postponed to Monday. Today the assembly was heated up with Ysrcp MLA Roja Suspension Topic from the Begining